- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో గర్ణిణీ స్త్రీలు బయటికి వెళ్లి మెడిసిన్ తెచ్చుకోవడం, వైద్యులను సంప్రదించడం ఇబ్బందికరంగా మారింది. సరైన సమయానికి మెడిసిన్ దొరకక, వైద్యుల సలహలు అందక ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. గర్బిణీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రతిరోజు వారు వాడే మెడిసిన్ ఉచిత సర్వీస్ చేయబోతున్నామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో వృద్దులకు, వికలాంగులకు, మహిళలకు, పిల్లలకు అత్యవసరమైన మందులు అందించి 1500 మంది ప్రాణాలు కాపాడామన్నారు. ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడంతో గర్భిణీలు మెడిసిన్ కోసం ఇబ్బందులు పడకూడదని తమ సంస్థ నుంచి ఉచిత సర్వీస్ చేస్తున్నామన్నారు. అత్యవసర మెడిసిన్ ఉచిత సర్వీస్ కావాలనుకునే వారు తమను సంప్రదించవచ్చన్నారు. లొకేషన్ షేర్ చేస్తే ఇంటికి వచ్చి మెడిసిన్ అందజేస్తామన్నారు. బిల్లు ఆధారంగా డబ్బులు చెల్లిస్తే సరిపోతుందన్నారు. సంబంధిత వైద్యులతో టెలీ సర్వీస్ అవకాశం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సంప్రదించవలసిన నంబర్లు 8499031234, 7799553385, 8897736324, 9390322191, 9849404141, 8801902939.