- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అబ్దుల్లాపూర్‌మెట్ లో ఉచిత వైద్య శిబిరం
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా వైద్యులు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని బీజేపీ ఫ్లోర్ లీడర్ కరాడి శ్రీలత అనిల్‌కుమార్ అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఉమర్‌ఖాన్‌గూడ (సంఘీనగర్)లో కామినేని ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీలత అనిల్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలత అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు వైద్యులు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగానే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కామినేని ఆస్పత్రి డాక్టర్ రితిక, మార్కెటింగ్ మేనేజర్ డా. బి.బాలకృష్ణ, డా.కె. శ్రీలత, నర్సులు బి.శబరి, మహేశ్వరి, గ్రామ పెద్దలు బుచ్చిరెడ్డి, నల్ల మల్లారెడ్డి, గజ్జల శ్రీకాంత్ రెడ్డి, తుల సుధాకర్ గౌడ్, తుల వెంకటేష్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.