ఫేక్ న్యూస్: అందరికీ ఉచిత ఇంటర్నెట్ ఇస్తున్న కేంద్రం

by vinod kumar |
ఫేక్ న్యూస్: అందరికీ ఉచిత ఇంటర్నెట్ ఇస్తున్న కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఇంట్లో ఖాళీగా ఉన్నందున్న మే 3వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే వార్తలో ఎలాంటి నిజం లేదని, ఇది తప్పుడు వార్త అని బుధవారం రోజున ప్రసార భారతి న్యూస్ సర్వీస్ స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇంటి దగ్గరి నుంచి పనిచేసే సదుపాయం కల్పించడానికి వీలుగా టెలికాం శాఖ మే 3వ తేదీ వరకు ఉచిత ఇంటర్నెట్ అందిస్తోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. గతంలో కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో అందరూ ఇంటి నుంచి పనిచేసుకోవడానికి వీలుగా తమ వంతు ప్రయత్నం చేస్తామని ప్రకటించడమే ఈ నకిలీ వార్తకు ఆధారమని, అయితే అలాంటిదేమో లేదని పీఐబీ తెలిపింది.

Tags :Corona, covid, lockdown, fake news, free internet, PIB fact check

Advertisement

Next Story

Most Viewed