- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియోజక వర్గ ప్రజలకు MLA రేగా కాంతారావు గుడ్ న్యూస్
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీపి కబురు అందించారు. మణుగూరు మండలంలోని వందపడకల ఆసుపత్రిలో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా డిసెంబర్ 29 తేదీ (బుధవారం)ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం మండలంలోని వంద పడకల ఆసుపత్రిని రేగా సందర్శించి కంటి పరీక్ష ఏర్పాటు పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ.. నియోజకవర్గం ప్రజలందరూ ఉచిత కంటి ఆపరేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2 వేల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్ చేస్తారని ఈ సందర్భంగా వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి ఉచితకంటి ఆపరేషన్ గురించి తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 29తేదీ బుధవారం నియోజక వర్గం ప్రజలందరూ హాజరై ఉచిత కంటి ఆపరేషన్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నరసింహారావు, పీఏసీఎస్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి గౌడ్, తాత రమణ, వట్టం రాంబాబు, ముద్దంగుల కృష్ణ, సృజన్ తదితర నాయకులు పాల్గొన్నారు.