- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్‌లో రూ. 3,825 కోట్ల విదేశీ నిధులు వెనక్కి!
దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు నెలల కాలంలో భారతీయ మార్కెట్లలోని రుణ విభాగంలో భారీగా కొనుగోళ్లు నమోదలయ్యాయి. అక్టోబర్ నెలలో ఇప్పటివరకు రూ. 3,825 కోట్ల నిధులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. అంతకుముందు సెప్టెంబర్ నెలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 13,363 కోట్లను, ఆగష్టులో రూ. 14,376 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేశారు. అయితే, అక్టోబర్ నెలలో కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, లాభాల స్వీకరణతో నిధుల ఉపసంహరణకు సిద్ధపడ్డారని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక సేవల రంగంలో కొనుగోళ్లు అధికంగా ఉండటంతో నిధులు వెనక్కి వెళ్లాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఈ నెలలో రూ. 1,494 కోట్ల ఎఫ్‌పీఐలు ఉపసంహరణ నమోదవగా, విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీ విభాగంలో రూ. 2,331 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, చైనా ఆర్థికవ్యవస్థలో కొనసాగుతున్న సవాళ్లు వంటి అంతర్జాతీయ పరిణామాలు నిధుల సంహరణకు కారణమని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. సమీప భవిష్యత్తులో యూఎస్ ఫెడ్ నిర్ణయాలు విదేశీ నిధులపై ప్రభావం చూపనున్నట్టు కోటక్ సెక్యూరిటీస్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ వివరించారు.