షాకింగ్ ఇన్సిడెంట్.. 4 వేల లీటర్ల డీజిల్ దొంగిలింత

by Sumithra |   ( Updated:2021-07-09 06:59:33.0  )
షాకింగ్ ఇన్సిడెంట్.. 4 వేల లీటర్ల డీజిల్ దొంగిలింత
X

దిశ, జడ్చర్ల: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పేర్లు ఎత్తితే చాలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను చూసి వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే.. అసలే పెట్రోల్ రేట్లు పెరిగి జనాలు ఆందోళనలో ఉంటే.. నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు వేల లీటర్ల డీజిల్ దొంగిలించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి జాతీయ రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న శారదా ఫిల్లింగ్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకుల సామార్థ్యాన్ని పరీక్షించడానికి భారత్ ఆయిల్ కంపెనీ వారు నాలుగువేల లీటర్ల డీజిల్ ట్యాంకులలో నిల్వ ఉంచారు. దీనిని గమనించిన దుండగులు అర్ధరాత్రి సమయంలో మరో ట్యాంకర్ తెచ్చి మోటార్ల ద్వారా డీజిల్ దొంగలించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న యజమానులు లబోదిబోమంటూ జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed