- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గాలేరు -నగరి’కి నాలుగు టెండర్లు
దిశ, ఏపీ బ్యూరో: గాలేరు-నగరి కాలువ అభివృద్ధి పనులకు సంబంధించి పనులు దక్కించుకోవడానికి నాలుగు సంస్థలు పోటీ పడ్డాయి. కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30వేల క్యూసెక్కులకు అభివృద్ధి చేయడం, కర్నూలు జిల్లాలో గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), అవుకు వద్ద అదనంగా పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో టన్నెల్ తవ్వే పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ.1269.49 కోట్ల అంచనా వ్యయంతో 36నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో నిర్వహించిన టెండర్‌లో టెక్నికల్ బిడ్‌ను బుధవారం కర్నూలు ప్రాజెక్ట్ సీఈ మురళీనాథ్‌రెడ్డి తెరిచారు. ఎన్‌సీసీ (నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ), వైఆర్కే (ఎర్రం రామకృష్ణారెడ్డి కన్‌స్ట్రక్షన్స్), డీఎస్సార్(జాయింట్ వెంచర్), ఎమ్మార్కేఆర్(మేడా రామకృష్ణారెడ్డి కన్‌స్ట్రక్షన్ కంపెనీ)లు బిడ్‌లు దాఖలు చేశాయి. 28న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఈ బిడ్‌లో తక్కువ ధర(ఎల్–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి అదే రోజున ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని ఎస్‌ఎల్‌టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు. 29న ఎస్‌ఎల్‌టీసీ సమావేశమవుతుంది. టెండర్ ప్రక్రియను పరిశీలించి ఆమోదిస్తుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్డర్ జారీ చేస్తారు.