- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంటూర్‌లో నలుగురు మైనర్ల అదృశ్యం
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో నలుగురు మైనర్ల అదృశ్యం కలకలం రేపుతోంది. ఒకేసారి ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు మైనర్ బాలికలు కనిపించకుండా పోయారు. ఈ నలుగురు మైనర్లు ఒకే ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. వివరాలు, గుంటూరు నగరంలోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన నలుగురు మైనర్లు ఆటలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. అయితే ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదృశ్యమైన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. ఈ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పందించారు. పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్నకోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. మెుత్తానికి ఒకే గ్రామానికి చెందిన నలుగురు మైనర్లు అదృశ్యమవ్వడం స్థానికంగా చర్చనీయాశంమైంది.