కేరళను వణికిస్తోన్న బ్లాక్ ఫంగస్.. నలుగురు మృతి

by Shamantha N |
కేరళను వణికిస్తోన్న బ్లాక్ ఫంగస్.. నలుగురు మృతి
X

తిరువనంతపురం : కేరళలో బ్లాక్ ఫంగస్(మ్యూకోర్‌మైసిస్)తో నలుగురు మరణించారు. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు, పతనంథిట్ట జిల్లాకు చెందిన మరో ఇద్దరు బ్లాక్ ఫంగస్‌తో పోరాడి ఓడారని, ఆదివారం నలుగురూ మరణించారని వైద్యులు వెల్లడించారు. కాగా, ఎర్నాకుళం, కొట్టాయం ఆస్పత్రుల్లో మరో ఇద్దరు పేషెంట్లు ప్రస్తుతం బ్లాక్ ఫంగస్‌కు చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయని తెలిశాక, రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్‌పై మెడికల్ ఆడిట్ చేపట్టనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఫంగస్‌ కోసం సంబంధిత ఔషధాలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటామని సీఎం పినరయి విజయన్ తెలిపారు.

వారణాసిలో నలుగురి మరణం..

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 48 గంటల్లోనే నలుగురు పేషెంట్లు బ్లాక్ ఫంగస్‌తో కన్నుమూశారని వైద్యులు వివరించారు. మావుకు చెందిన 55ఏళ్ల పేషెంట్, ఘాజీపూర్‌కు చెందిన 45ఏళ్ల పేషెంట్ బ్లాక్ ఫంగస్‌తో ఆదివారం మరణించారని, మరో ఇద్దరు కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్ (లెవెల్ 3)లో శనివారం మరణించారని తెలిపారు. కాగా, 78 మంది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చికిత్స పొందుతున్నారని, మరో నలుగురు పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వివరించారు.

Advertisement

Next Story