- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల వెంట ఆ నలుగురు?.. టీఆర్‌ఎస్‌లో ఆందోళన
దిశ, వేములవాడ: ఈటల పార్టీ మారుతున్న నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను గురువారం కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈటలతో పాటు ఆమె కూడా బీజేపీలో చేరతారని తెలుస్తోంది. అలాగే నలుగురు కౌన్సిలర్లు కూడా ఈటల వెంట నడిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం వేములవాడలో ఈటల వెంట నడిచేది ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. వేములవాడలో అధికార పార్టీకి పట్టున్న నేపథ్యంలో నలుగురు కౌన్సిలర్లు ఈటల వెంట వెళుతున్నారని తెలియడంతో టీఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అలాగే ఉద్యమకాలంలో పోరాటం చేసిన నాయకులు కూడా ఈటల బాటలో నడుస్తున్నారనే ఊహాగానాలు వేములవాడలో జోరందున్నాయి.
నాయకుడు లేని పార్టీ
అధికార పార్టీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీలో ఉండడంతో పార్టీలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలంగా పార్టీలో రెండు గ్రూపులు తలెత్తడంతో.. ఇదే అదునుగా భావించిన టీఆర్‌ఎస్ నేతలు ఇతర పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు సమచారం. ఈటల పార్టీ మారుతున్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించి ఈటల వెంట నడిచేందుకు చూస్తున్నట్లు సమచారం.