నాలుగు రోజుల క్రితం నాలాలో వ్యక్తి గల్లంతు

by Sampath |
Drainage
X

దిశ, కుత్బుల్లాపూర్: నాలలో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ సీపీఆర్ కాలనీలోని గణేష్ టవర్స్‌లో నివాసముండే మోహన్ రెడ్డి(48) గాంధీనగర్‌లోని ఎంటీఆర్‌లో పని చేస్తుంటాడు. ఈ నెల 25 వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో స్థానికంగా ఉన్న రాయల్ వైన్స్‌లో మద్యం సేవించేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చాడు. రాత్రి 9.50 గంటల ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం పక్కనే ప్రమాదకరంగా ఉన్న నాలా వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.

గమనించిన స్థానికులు ఓ వ్యక్తి అందులో పడిపోయాడని పోలీసులకు తెలుపడంతో సంఘటన స్థలానికి చేరుకొని వెతికినా ప్రయోజనం లేదు. బుధవారం సైతం గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే పక్కనే గల సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి అందులో పడిపోయినట్లు గుర్తించారు. అతను మోహన్ రెడ్డి అని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed