పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

by Sridhar Babu |   ( Updated:2021-07-10 10:29:35.0  )
peddpalli
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి వద్ద గేదెను అటో ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో బోల్తా కొట్టడంతో నలుగురు వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ధర్మారం మండలం గోపాల్ రావు పేటకు చెందిన వ్యవసాయ కూలీలుగా తెలుస్తోంది. దొంగతుర్తి గ్రామంలో వ్యవసాయ కూలీ పనుల కోసం వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షత గాత్రులను వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Advertisement

Next Story