- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాసనమండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు చట్ట సవరణ బిల్లులకు శాసనమండలి బుధవారం ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో మంగళవారం ఆమోదం పొందిన ఈ బిల్లులను శాసనమండలి కూడా ఆమోదించడంతో ఇక గవర్నర్ ఆమోదంతో చట్టంగా రూపొందడమే తరువాయి. కేవలం బిల్లుల కోసమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినందున శాసనసభ మంగళవారం నిరవధికంగా వాయిదాపడగా, మండలి బుధవారం నిరవధికంగా వాయిదా పడింది.
ఇండియన్ స్టాంప్ బిల్లు, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు (వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్పిడిచేసే)ను ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టి ఆ బిల్లుల ఉద్దేశాన్ని వివరించారు. మండలిలో సైతం అదే కొనసాగింది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల ఉద్దేశాన్ని వివరించిన అనంతర సభ్యులు చర్చించిన తర్వాత ఆమోదం లభించినట్లు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు, సందేహాలకు మంత్రులు బదులిచ్చారు. బిల్లులకు సభ ఆమోదం లభించడంతో సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
రిజర్వేషన్ల వ్యవస్థపై స్క్రూటినీ చేయించాలి: జీవన్‌రెడ్డి
మున్సిపల్ చట్టంపై ప్రభుత్వ చర్యలన్నీ ఆర్భాటాలేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల వ్యవస్థపై అడ్వొకేట్ జనరల్‌తో స్ర్కూటినీ చేయించాలని డిమాండ్ చేశారు. సభలో చర్చల అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, 2016లో అమలు చేసిన చేసిన రిజర్వేషన్ ప్రక్రియ ఆ ఒక్కసారికి మాత్రమే పరిమితమని, కానీ ప్రభుత్వం దాన్నే కొనసాగిస్తానంటోందని, చట్టపరంగా ఇది నిలబడదని అన్నారు. ప్రభుత్వం తెచ్చిన మున్సిపల్ రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేయాలని టీపీసీసీని కోరుతానన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని 50శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులో ఉందని, జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కూడా రాజ్యాంగంలోనే ఉందని, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లు 8శాతానికి పరిమితం అయిందని, బలహీన వర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు.