- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయవాదిపై హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో : భూ వివాదంలో న్యాయవాదిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ మేరకు న్యాయవాదిపై హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను నారాయణ గూడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ వివరాలను వెల్లడించారు. జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తెలిపిన ప్రకారం.. ఈ నెల 16న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబరు 7లో న్యాయవాది సిద్దార్థ్ సింగ్ చౌదరి నివాసంలోకి కొందరు దుండగులు ప్రవేశించి కత్తులతో బెదిరించారు.
ఈ సమయంలో కోర్టులో ఓడిపోయిన ల్యాండ్ వివాదానికి సంబంధించిన ఫైల్‌ను అడిగినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా, బాలాజీసింగ్‌కు సంబంధించిన ఇంటి వ్యవహారం కేసులో ఆపోజిట్ పార్టీతో న్యాయవాది కుమ్మక్కు అయ్యాడనే విషయంపై వీరిద్దరికీ విభేదాలు ఉన్నాయి. అంతే కాకుండా, ఇతర రియల్ వ్యాపారాల్లో తనకు రావాల్సిన కమిషన్ రాకుండా అడ్డుపడినట్టుగా భావించిన బాలాజీ.. న్యాయవాదిని హత్య చేయాలని భావించాడు. దీంతో మరో ముగ్గురితో కలిసి ఈ నెల 16న హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ కేసులో బాలాజీ సింగ్‌తో పాటు మహమ్మద్ వలీ, మహమ్మద్ వాసీం, షేక్ సులేమాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 1 తుపాకీ, 2 కత్తులు, 7 బుల్లెట్లతో పాటు 6 మొబైల్స్, హ్యాండ్ గ్లౌసెస్, సుజికి బైక్, సిలివేర్ టేప్ బండల్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. తుపాకీని రూ.15 వేలకు ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.