- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంజపడుగు SBI బ్యాంకు చోరీ కేసులో మరో కీలక పరిణామం
దిశ, పెద్దపల్లి : పెద్దపెల్లి జిల్లా గుంజపడుగు ఎస్‌బీఐ బ్యాంకు చోరీ కేసులో రామగుండం కమిషనరేట్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. మిస్టరీగా మారిన ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సఫలం అవుతున్నారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా దోపిడీకి పాల్పడిన ముఠా గుట్టును రట్టు చేయడంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ కేసులో ఓ నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నలుగురిని కూడా కస్టడీకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జైల్‌లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. వీరిని అన్ని కోణాల్లో విచారించగా రాబరీ ఘటనపై సమగ్ర సమాచారం తెలిసింది.
అదుపులోకి తీసుకున్నవారిలో చంద్రాపూర్ జిల్లా దేవదాస్ గ్రామానికి చెందిన రాజు వసంతర్ రావు, రోలహటేకు చెందిన రూప్ చాంద్ కప్గాటే, సంకేత్ తేజ్ రామ్, హసన్పూర్ కు చెందిన దాన్విర్ గ్యాస్టోలను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సత్యనారాయణ వెల్లడించారు. కస్టడీ ముగియడంతో మంథని కోర్టులో హాజరు పరిచామన్నారు. మహారాష్ట్ర పోలీసులు 2.9 కిలోల బంగారం రికవరీ చేశారని, ఆ రికవరిలో 70 శాతం బంగారం గుంజపడుగు ఎస్‌బీఐ బ్యాంకు నుండి ఎత్తుకెళ్లిందేనని నిందితులు విచారణలో అంగీకరించారన్నారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితులు గుడ్డు, మాస్టర్, బురియలను పట్టుకునేందుకు స్పెషల్ టీంలను ఉత్తర ప్రదేశ్‌కు పంపించామని తెలిపారు.