- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ, ఎమ్మెల్యేలపై 509 కేసులు
దిశ, క్రైమ్ బ్యూరో: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేరచరిత్ర కలిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసులను సత్వరమే విచారించేందుకు ఏర్పాటు చేయాలని, వెంటనే న్యాయ స్థానాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించేందకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్‌ను కోరింది. ప్రత్యేక కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియామకం చేయకపోవడంతో కేసుల విచారణ సక్రమంగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మానాభరెడ్డి శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం పద్మనాభరెడ్డి మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, జీవో నెంబరు 6 ప్రకారం ప్రత్యేక కోర్టుకు 30 మంది సిబ్బందిని మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ ప్రత్యేక న్యాయ స్థానం 2018 మార్చి 2వ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభించినా… ఇతర ప్రభుత్వ సిబ్బంది సహకారం అందజేయడం లేదని విమర్శించారు. మొత్తం 64 మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు, 10 మంది ఎంపీలపై 133 కేసులు, 30 మంది మాజీ ప్రజా ప్రతినిధులపై మొత్తం 509 కేసులు ఉన్నాయన్నారు. అయితే, ఈ మొత్తం 509 కేసులలో 245 కేసులు మాత్రమే ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ అయ్యాయని తెలిపారు. మంజూరైన 30 మంది సిబ్బందిలో 16 గురిని మాత్రమే నియామకం చేశారన్నారు. 2018 మార్చి నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రత్యేక న్యాయ స్థానం ద్వారా 73 కేసులలో మాత్రమే తీర్పు వచ్చిందన్నారు. వీటిలో ఏ ఒక్క కేసులో కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు శిక్ష పడలేదన్నారు. దీంతో పోలీసు యంత్రాంగంపై అనుమానాలు కలుగుతున్నట్టు సందేహం వ్యక్తం చేశారు. ప్రజలకు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు.