కోహ్లీని నిందించడం సరికాదు : సెహ్వాగ్

by Anukaran |   ( Updated:2020-11-07 10:41:04.0  )
కోహ్లీని నిందించడం సరికాదు : సెహ్వాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదరగొట్టింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లకు 131/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత చేధించే క్రమంలో మొదట హైదరాబాద్ బ్యాట్‌మెన్‌లు తడబడినా, కేన్ విలియమ్సన్, జేసన్ హోల్డర్ రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణం అని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతకొన్ని సీజన్‌లుగా కప్పు కొడతామని చెబుతూ… వరుసగా విఫలం కావడానికి కోహ్లీ కెప్టెన్సీనే కారణం అని ఆర్సీబీ ఫ్యాన్స్‌తో పాటు పలువురు క్రికెటర్‌లు కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేగాకుండా ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీని తీసేయాలని కూడా విమర్శలు వస్తున్నాయి.

వీటిపై తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిచాడు. ఈ సందర్భంగా కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. భారత జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని, అతని సారథ్యంలో ఇండియా టీమ్‌ కూడా అద్భుత విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ఇండియా టీమ్‌లో మొత్తం క్రీడాకారులందరూ అద్భుతమైన ఆటగాళ్లు కాబట్టే సక్సెస్ అవుతుందని తెలిపారు. అలాగే ఆర్సీబీ జట్టు విషయంలో కూడా ఓటమి చెందినంత మాత్రాన కోహ్లీని కెప్టెన్‌గా వైదొలగాలని విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఆర్సీబీ టీమ్ సరిగా లేదని, కోహ్లీ, డివిల్లియర్స్ తప్పా మిగతా ఆటగాళ్లెవరూ రాణించడం లేదని, అలాంటప్పుడు ఆర్సీబీ టైటిల్ గెలవడం ఎలా సాధ్యం అవుతుందని అన్నారు. ఆర్సీబీ జట్టులో ఇప్పటివరకూ మంచి బ్యాటింగ్‌ లైనప్‌ కనిపించలేదని వెల్లడించారు. టీమ్‌లో సమూల మార్పులు జరిగినప్పుడే విజయం సాధ్యం అవుతుందని అన్నారు. అంతేగానీ ఓడినంత మాత్రాన ఒక ఆటగాడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు.

Advertisement

Next Story