మాజీ బౌలర్ సోదరుడు కాల్చివేత

by Anukaran |
మాజీ బౌలర్ సోదరుడు కాల్చివేత
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ సోదరుడు టైరోన్‌(32) అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. గుర్తు తెలియని దుండగుల తుపాకీ తూటలకు బలయ్యాడు. సౌత్ ఆఫ్రికాలోనే కాకుండా యావత్ ప్రపంచం ఓ నెంబర్ వన్ బౌలర్ సోదరుడిని కాల్చి చంపడంతో నివ్వెరపోతున్నారు.

టైరోన్ స్వస్థలమైన కేప్ టౌన్‌లోని రావెన్స్‌మీడ్ ప్రాంతంలోనే ఈ దారుణం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1.10 నిమిషాల ప్రాంతంలో టైరాన్‌ను దుండగులు కాల్చిచంపారు. ఇంటికి కూత వేటులోనే ఈ హత్య జరగడంతో ఫిలాండర్ తల్లి ఘటనా స్థలానికి చేరుకుంది. రక్తపు మడుగులో ఉన్న తన కొడుకుని చూసి అక్కడే కుప్పకూలిపోయింది. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. టైరోన్ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే తన చిన్న తమ్ముడి దారుణ హత్య పై బౌలర్ ఫిలాండర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘నా స్వస్థలమైన రావెన్స్‌మీడ్ ప్రాంతంలో నా సోదరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇటువంటి క్లిష్ట సమయంలో కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరుతున్నాను.. ఈ మర్డర్‌కు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మీడియా-పోలీసులకు ఈ కేసు దర్యాప్తులో కొద్దిగా అవకాశం ఇవ్వాలి. ఈ హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు.. ఊహగానాలు మరింత బాధపెడుతున్నాయి. టైరోన్ మన హృదయాల్లో శాశ్వతంగా ఉంటాడు.. అతని ఆత్మకు శాంతి కలిగిద్దాం.. అంటూ బాధతో కూడిన ప్రకటన విడుదల చేశాడు.

ఎవరి ఫిలాండర్:

దక్షిణాఫ్రికాకు చెందిన కీలక మాజీ పేసర్‌లలో ఇతను ఒకడు. సఫారీల జట్టు తరఫున 64 టెస్టు మ్యాచులు ఆడిన ఫిలాండర్ ఏకంగా 224 వికెట్లు తీశాడు. ఇక 30 వన్డేలు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా కూడా ఫిలాండర్ రాణించేవాడు. ఇంతటి ప్రతిభ కలిగిన సోదరుడి హత్యకు గురవడంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్‌లో విషాదం నెలకొంది.

https://twitter.com/VDP_24/status/1313956885373091842

Advertisement

Next Story

Most Viewed