- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెప్టెన్ మార్పు విషయంలో పూర్తి బాధ్యత వారిదే.. షాకయ్యానంటూ మాజీ సెలెక్టర్..!
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియామకం, కోహ్లీని తప్పించడంపై రోజూకో చర్చ జరుగుతూనే ఉంది. ఇదే విషయంపై విరాట్ బుధవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అనంతరం కోహ్లీ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ స్పందించారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించడం పూర్తిగా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిందని, ఇందులో బీసీసీఐ పాత్ర ఏమీ లేదని చెప్పారు. ఆటగాళ్లను ఎంపిక చేయడం, కెప్టెన్‌ని నియమించడం సెలక్షన్ కమిటీ కర్తవ్యం అంటూ గుర్తు చేస్తూనే.. సెలక్షన్ ప్రక్రియలో బీసీసీఐ ఎలాంటి పాత్ర పోషించదన్నారు.
కానీ, ప్రెస్ మీట్‌లో విరాట్ కామెంట్లు కాస్త షాకింగ్‌గా ఉన్నాయని.. కోహ్లీ అలా అనడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వ్యక్తిగతంగా వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదని చెబుతూనే.. ప్రొఫెషనల్‌గా ఈ విషయాన్ని ముందే కోహ్లీకి చెప్పాల్సిందన్నారు. ఇక కోహ్లీ-రోహిత్ మధ్య విబేధాలపై స్పందిస్తూ.. ఆ ఇద్దరు చాలా పరిణితి చెందిన ఆటగాళ్లు అంటూ పేర్కొన్నారు. ఏ రోజు కూడ ఒకరిపై మరొకరు ప్రశ్నలు వేసుకోలేదని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసన్నారు. మంచి స్నేహితులు కాకపోయిన టీమిండియాలో వారి కలయిక చాలా గొప్పదంటూ శరణ్‌దీప్ వెల్లడించారు.