- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘నిలకడగా మన్మోహన్ సింగ్ ఆరోగ్యం’
న్యూఢిల్లీ: ఛాతి సంబంధిత సమస్యలతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్‌లో ఉన్నారని తెలిపాయి. ఆస్పత్రిలో చేరినాక సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్‌ను కార్డియో-థొరాసిక్ వార్డుకు తీసుకెళ్లి అబ్జర్వేషన్‌లో ఉంచారు. కొత్త మెడికేషన్ తీసుకున్న తర్వాత స్వల్పంగా జ్వరం రావడంతో ఈ వార్డులో పరీక్షలు జరిపామని సంబంధిత వర్గాలు వివరించాయి. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయిక్ మాజీ ప్రధాని సింగ్‌కు చికిత్సనందిస్తున్నారు. మార్చి నెలలో మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురవ్వడంతో పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు తీసుకున్న మన్మోహన్ సింగ్‌కు రెండు సార్లు హార్ట్ బైపాస్ సర్జీలు జరిగాయి.