భారత్‌కు ఉన్న సత్తా.. ఆస్ట్రేలియాకు కూడా లేదు : పాకిస్తాన్ మాజీ కెప్టెన్

by Shyam |
Former Pakistan captain Inzamam Ul Haq
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా టీమిండియా జట్టు చాలా బలంగా ఉందని, దాదాపు 50 మందికి పైగా ఆటగాళ్లు రెడీగా ఉన్నారని ప్రశంసించాడు. ఇంత బలంగా 1990, 2000 సంవత్సరంలో నాటి దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాకు కూడా లేదన్నారు. ప్రస్తుతం టీమిండియాకు ఆడేందుకు కనీసం 50 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, అనుభవజ్ఞులైన స్టార్‌ ఆటగాళ్లు, ప్రతిభగల యువ ఆటగాళ్లతో భారత్‌ క్రికెట్‌ పటిష్టంగా ఉందని అన్నాడు.

team india

కోహ్లి నేతృత్వంలో 23 మంది సభ్యులతో కూడిన భారత జంబో జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంటే, అంతే బలమైన మరో భారత జట్టు (భారత్‌-B) శ్రీలంక పర్యటనకు సిద్ధం కావడం చూస్తు్ంటే భారత క్రికెట్‌ ఏ స్థాయిలో ఉందో సస్పష్టమవుతుందని అన్నాడు. నాలుగుకు పైగా బలమైన జట్లను వివిధ అంతర్జాతీయ స్థాయి జట్లతో తలపడేందుకు సిద్ధం చేయగల సత్తా భారత్‌కు ఉందని కొనియాడాడు. అనుభవజ్ఞులైన స్టార్‌ ఆటగాళ్లతో పాటు ప్రతిభగల యువ ఆటగాళ్లతో భారత్‌ క్రికెట్‌ నిండుకుండను తలపిస్తుందని ఆకాశానికెత్తాడు. ఓ దేశం తరపున రెండు బలమైన జట్టు జట్లు వివిధ దేశాలతో ఒకేసారి తలపడటం క్రికెట్‌ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చేమో అని అభిప్రాయపడ్డారు.

teamindia

Advertisement

Next Story

Most Viewed