- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎలక్షన్ స్టంట్‌లు అందరికీ తెలుసు : మాజీ ఎంపీ వివేక్
దిశ, కమలాపూర్: ఈటల రాజేందర్‌ను అణచి వేయడం కోసమే సంక్షేమ పథకాలు సృష్టిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఈటల నివాసంలో ఆయన మీడియాతో మాట్లా్డుతూ.. ఈటలను ఓడించేందుకు హుజురాబాద్‌కు వస్తోన్న ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌లు వారి నియోజకవర్గాల అభివృద్ధికి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు.
ముందుగా వారు వారి నియోజకవర్గాలకు ఏం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. గతంలో నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పాలని, టీఆర్ఎస్ చేసే ఎన్నికల స్టంట్‌లు అన్ని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో దేశంలోని 80 కోట్ల ప్రజలకు ఆరు నెలలకు సరిపడా ఉచిత రేషన్ అందించిందని, ఉచిత గ్యాస్‌ను అందించామని, ఉపాధి హామీ వేతనాన్ని రూ.180 నుంచి రూ. 237 లకు పెంచి ప్రజలకు పనులు కల్పించామన్నారు. దేశంలోనే 95 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది కూడా బీజేపీనే అని, మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.
ఇక్కడికి వచ్చే నాయకులు మద్యం, బిర్యానీ పంచిపెట్టి ఈటలకు ఓటేయ్యద్దంటూ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రమంటూ గొప్పలకు పోయి నాలుగు లక్షల కోట్ల అప్పుచేసి, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజల మనసులను గెల్చుకున్నారని, ఈటలపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, ఈటల గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని ప్రజలందరూ భావిస్తున్నారన్నారు.