పోలవరంపై దోబూచులాటొద్దు!

by srinivas |
పోలవరంపై దోబూచులాటొద్దు!
X

దిశ, ఏపీబ్యూరో : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంతో దోబూచులాటలొద్దని, అది సమంజసం కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​కుమార్ ​ప్రభుత్వానికి హితవు పలికారు. రాజమండ్రిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఎత్తు, పునరావాస ప్యాకేజీపై కేంద్రం నుంచి స్పష్టతనిప్పించాలని ఉండవల్లి కోరారు. ప్రాజెక్టు నిర్మించాక నీళ్లు చాలకుంటే ప్రజలు రోడ్డు మీదకు వస్తారని హెచ్చరించారు. పునరావాసం, పరిహారానికి సంబంధించి కేంద్రం నిధులు ఇస్తుందో లేదో ప్రకటించాలన్నారు. ముసుగులో గుద్దులాటలా వ్యవహరించొద్దని సీఎం జగన్​కు సూచించారు.

పార్లమెంటులో చట్టాలు చేసిన వాటినే కేంద్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. అలాంటి సందర్భంలో రాష్ర్ట జీవనాడి అయిన పోలవరంపై స్పష్టత తీసుకోవడం అవసరమని సూచించారు. ప్రాజెక్టును చూసేందుకు రైతుల్ని అనుమతించకుండా ఆంక్షలు విధించడం రాష్ర్ట ప్రభుత్వానికి తగదని చెప్పారు. దేశంలోనే అత్యధిక అప్పులు పొందిన రాష్ర్టంగా ఏపీ రికార్డులకెక్కిందని ఉండవల్లి అరుణ్​కుమార్​ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed