కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

by Anukaran |   ( Updated:2020-08-08 04:11:36.0  )
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని ప్రభావంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ప్రజల ప్రాణాలను బలిగొంటోన్నది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతిచెందాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు టెస్టులు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

కాగా, ఆరుసార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు.

Advertisement

Next Story