- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ మాటలు నమ్మొద్దు.. హుజురాబాద్ ప్రజలకు మాజీ ఎంపీ లేఖ
దిశ, హుజురాబాద్ రూరల్ : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హుజురాబాద్ ప్రజలకు బహింగ లేఖ రాశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బాసటగా నిలవాలని కోరారు. తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడతారని.. నేను, ఈటల రాజేందర్ కేసీఆర్ వెంట నడించాం. కానీ ఆయన మోసం చేశారు. ఇప్పుడు హుజురాబాద్‌లో తిరుగుతున్న నాయకులు ఎన్నికల తరవాత కనిపించరు. మీతో కలిసి ఉండేది ఈటల రాజేందర్ మాత్రమే. కావున ఆయనకు అండగా నిలబడాలని కోరుతున్నా.. అంటూ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాసిన లేఖను హుజురాబాద్ నియోజకవర్గంలో పంచుతున్నారు. ఆయనకు సంబంధించిన టీమ్ ఒకటి ఇంటింటా ఈ లేఖలను పంపిణీ చేస్తోంది. లేఖలో ఏముందంటే..
నమస్కారం.. నేను కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడిని…
తెలంగాణ ఉద్యమానికి మూల స్తంభాలుగా ఉన్నారు మీరు. హుజురాబాద్ ఓటరుగా మీకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నికలో మీరు ఇచ్చే తీర్పు రేపటి తెలంగాణకు ఆశాకిరణం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు రాష్ట్రమంతా మీ దిక్కు చూస్తోంది. ఈ చారిత్రక సందర్భంలో మీతో నా మనసులోని కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడుతాయని అని ఎన్నో ఆశలు పెట్టుకున్నం. కులమతాలకు అతీతంగా మనమందరము ఒక్కటై పోరాడినం.
మేము కూడా మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసినం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మా జిల్లా ప్రజల సమస్యలను తీర్చుతాడని నమ్మి పని చేసినం. కానీ మా రంగారెడ్డి జిల్లా అంటే.. నేను ప్రాతినిధ్యం వహించే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేసిండు. ఉమ్మడి రాష్ట్రంలో మా జిల్లాకు సాగు నీరు విషయంలో జరిగిన అన్యాయం తెలంగాణలో తీరుతది అనుక్నునం. కానీ, తెలంగాణ వచ్చినంక మాకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ప్రాణహిత-చేవెళ్లను మాకు కాకుండా చేసి… కృష్ణా నది నుండి నీళ్ళు ఇస్తానని చెప్పిండు. 2014 నుండి ఇప్పటివరకు కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలేదు. ఇంత కంటే అన్యాయం ఉంటదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కడుతా అని చెప్పి మోసం చేసిండు. ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా తియ్యలేదు. మా ప్రాంతంలో ఉన్న 84 గ్రామాలకు శాపంగా మారిన జీవో నెంబర్- 111ను ఎత్తెస్తా అని చెప్పి మాట నిలబెట్టుకోలేదు. చార్మినార్ జోన్‌లో ఉన్న మా వికారాబాద్ జిల్లాను కుట్ర పూరితంగా జోగులాంబ జోన్‌లోకి మార్చిండు ప్రజలు తిరుగుబాటు చేసేసరికి భయపడి తిరిగి చార్మినార్ జోన్లో కలిపి పెద్ద మేలు చేసినట్టు చెప్పుకున్నడు. మా అనంతగిరికి నిధులు ఇచ్చి ధార్మికంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా అని ఎన్నో సార్లు మాట ఇచ్చి మోసం చేసిండు. తోల్కట్ట, కోకాపేట్లలో గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు, చిన్న ప్లాట్లను గుంజుకున్నారు.
ఇట్ల చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్క విషయంలో మాకు అన్యాయమే జరిగింది. సీమాంధ్రులను మించిన అన్యాయం కె.సి.ఆర్. చేషిండు. మా జిల్లాకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములు వేలం వేసి, పైసలు మా జిల్లా ప్రజలకు ఉపయోగించలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లు హుజూరాబాద్లో కూడా ఎన్నో హామీలు ఇస్తున్నారు. బై ఎలక్షన్‌లో మీ ఓట్ల కోసం ఇవన్నీ చెప్తున్నారు. మాతో పాటు యావత్ తెలంగాణను మోసం చేసి వంచిస్తున్న కేసీఆర్‌ను ఓడించి తెలంగాణకు పట్టిన చెరను, చెదను వదిలిస్తారని ఆశిస్తున్నాను. పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే కొట్లాడి ఎల్లగొట్టినం. ఇప్పుడు మన ప్రాంతమోడే మనల్ని నమ్మించి మోసం చేస్తున్నదు. నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశాడు. పుట్టబోయే పిల్లల మీద కుడా అప్పు ఉన్నది. ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి భారతదేశములో ఈయనొక్కడే. ప్రజలకే కాదు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కూడా ఈయనొక్కడే. నిజాంను మించిన నియంతలా ఉంటున్నాడు.
నేనూ, ఈటెల రాజేందర్.. కేసీఆర్‌తో కలిసి పని చేసింది కేవలం తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడుతాయని మాత్రమే. స్వయం పాలనలో తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు అభివృద్ధి జరుగుతదని నమ్మినం. కానీ కేసీఆర్ మనందరినీ మోసం చేస్తున్నాడని గ్రహించినం. ఈటెల రాజేందర్ మీద కేసీఆర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని మనందరికీ తెలుసు. అవసరం తీరిపోయాక మంచి మంచోళ్లను పార్టీ నుండి వెళ్లగొట్టడానికి కెసీఆర్ ఎంతటి నీచానికైనా దిగజారుతడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నడు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా సరే ఈటెలను ఓడిస్తా అని అంటున్నడు. కానీ మీ సంకల్పం ముందట కేసీఆర్ పైసలు, అధికారం పని చేయవని, మీరు విజ్ఞతతో మేలు చేస్తారని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. సరైన నిర్ణయం తీసుకుని తెలంగాణకు ఇప్పుడు మీ హుజురాబాద్లో తిరుగుతున్న ఏ ఒక్కడూ ఎలక్షన్ల తరువాత మీకు కనిపించదు. మీకు ఏ కష్టం వచ్చినా తోడు ఉండేది మీ ఈటల రాజేందర్ మాత్రమే. కావున ఈటలను భారీ మెజార్టితో గెలిపించాలని కోరుతున్నాను.