- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఇంట విషాదం..
దిశ, సికింద్రాబాద్ : బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్ర రావు ఇంట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ఎల్ రావు(89) ఆదివారం వరంగల్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించి తార్నాకలోని స్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా చేరిన ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ఎల్ రావు ఒక వైపు బోధన సాగిస్తూనే మరో వైపు వివిధ అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో కొనసాగారు. ఇంజనీరింగ్ కళాశాల డీన్‌గా కూడా విధులు నిర్వహించారు. ఎన్‌వీఆర్ఎల్ రావుకు ఇద్దరు కుమారులు. ఆయన పెద్ద కుమారుడు మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది రామచంద్ర రావు కాగా.. రెండో కుమారుడు ఎన్వీ రమణారావు వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
రామచంద్ర రావు మృతి పట్ల పలువురి సంతాపం..
రామచంద్ర రావు మృతి పట్ల పలువురు నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్ ద్వారా రామచంద్రరావుతో మాట్లాడి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఎన్‌వీఆర్ఎల్ రావు గుండెపోటుతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.