వలస కూలీలకు వ్యవసాయ పనులు కల్పించాలి: పొంగులేటి

by Sridhar Babu |
వలస కూలీలకు వ్యవసాయ పనులు కల్పించాలి: పొంగులేటి
X

దిశ‌, ఖ‌మ్మం: వలస కూలీలకు వ్యవసాయ పనుల్లో ఉపాధి కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేల మంది వలస కూలీలు ఉన్నారని, సామాజిక దూరం పాటిస్తూనే పనులు చేసుకునే విధంగా వారికి అవ‌కాశం క‌ల్పించాల‌న్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యచరణను కలెక్టర్లు, పోలీసు అధికారుల పర్యవేక్షణ జరిగేటట్లుగా చర్యలు తీసుకోవాలని పొంగులేటి వివరించారు. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు ప్రభుత్వం సహాయ పడినట్లు అవుతుందని, వ్యవసాయ పనులూ కొనసాగుతాయని ఆయన తెలిపారు.

Tags: Former MLC Ponguleti sudhakar, Listen, Kishan Reddy, khammam

Advertisement

Next Story

Most Viewed