- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి మరో మోసానికి పూనుకున్నాడు : NVSS ప్రభాకర్
దిశ, కరీంనగర్ సిటీ: టీఆర్ఎస్ ప్రభుత్వ ఎన్నికల హామీల అమలు కోసం బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ రేకుర్తిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నాడు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని, మూడెకరాల భూమి అని దళిత సమాజాన్ని మోసం చేశాడని గుర్తుచేశారు. మళ్లీ దళితులను మోసం చేయడానికి దళితబంధు అంటూ కొత్త పథకం తీసుకొచ్చాడని, కానీ, అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఓట్లు దండుకోవడానికే దళితబంధు ప్రకటించారని స్పష్టమైందన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల అనంతరం, నాలుగో తేదీనుంచే హుజురాబాద్‌లో దళితబంధు అమలు అని చెప్పి నేటికీ దాని ఊసెత్తడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున డప్పుల మోత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతేగాకుండా.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ మేయర్ డి.శంకర్, కొరటాల శివరామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి, శ్రీనివాస్ రెడ్డి, దురిశెట్టి సంపత్, మర్రి సతీష్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, సొమిడి వేణు, నరహరి, లక్ష్మారెడ్డి, జాడి బాల్‌రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, మాడుగుల ప్రవీణ్‌లతోపాటు వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.