బొడిగే శోభ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతుపురాణం వైరల్..

by Sridhar Babu |   ( Updated:2023-08-22 04:55:16.0  )
బొడిగే శోభ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతుపురాణం వైరల్..
X

దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కారు గుర్తుపై గెలిచిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ తాజాగా బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. రెండో సారి పార్టీ టికెట్ ఇవ్వని కారణంగానే ఆమె కషాయ కండువా కప్పుకున్నట్లు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయంపై మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్‌ను ఆమె తీవ్ర పదజాలంతో దూషించారు. దీనిపై స్పందించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి కుమార్ బొడిగే శోభకు కౌంటర్ ఇచ్చారు.

అణగారిన వర్గం నుంచి వచ్చిన ఆమెను ఆదరించి ఎమ్మెల్యేను చేసిన సమయంలో కేసీఆర్‌ను దేవుడిగా వర్ణించిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతుండటం నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఇంకొసారి కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడితే నీ నాలుక చీరేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ప్రస్తుత ఎమ్మెల్యే రవికుమార్ ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. దీనిని వీక్షించేందుకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Advertisement

Next Story