రాసలీలల సీడీలు 10 రిలీజ్ చేయండి.. నా దగ్గర ఉన్నవి చూస్తే షాక్ అవుతారు

by Anukaran |   ( Updated:2021-03-26 04:15:46.0  )
Former minister Ramesh Jharkiholi
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘రాసలీలల సీడీలు ఒకటి.. ఇంకా పది విడుదలైనా భయపడను. నా జేబులో ఉన్న సాక్ష్యాధారాలను బయట పెడితే మీరంతా షాక్ అవుతారు. సీడీలను బయటపెట్టిన మహా నాయకుడి పేరును కూడా తగిన సమయంలో బహిర్కతం చేస్తా. తప్పు చేసిన వారిని జైలుకు పంపే వరకు విడిచి పెట్టను’ అని కర్ణాటక మాజీ మంత్రి, రాసలీలల సీడీలో చిక్కుకున్న రమేశ్ జార్కిహొళి అన్నారు.

బెంగళూరులో గత 10 రోజులుగా రాసలీలల సీడీపై తీవ్రంగా చర్చలు జరుగుతుండడంతో రమేశ్ జార్కిహొళి స్పందించారు. యువతి తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వీడియోలో కోరడం బట్టి ఇది కుట్ర అని మరోసారి రుజువైందన్నారు. సీడీల వెనకున్న ఆ నాయకుని పేరును త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య పట్ల తనకు గౌరవం ఉండేదని, కానీ నాపై అత్యాచారం కేసు నమోదు చేయాలనడం ద్వారా గౌరవం పోయిందని తెలిపారు. ఎక్కువగా మాట్లాడరాదని న్యాయవాది సూచించడం వల్ల అన్ని విషయాలనూ బహిరంగపరచలేనని చెప్పారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అజ్ఞాతంలో ఉన్న యువతి ఆచూకీ నేటికీ దొరకలేదు.

Advertisement

Next Story

Most Viewed