మాజీమంత్రి రఘవీరారెడ్డిని తాడుతో స్తంభానికి కట్టేసి..

by srinivas |
raghuvera reddy
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందిన రఘువీరారెడ్డి రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత దాదాపుగా రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి నుంచి తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా అంత హుషారుగా కనిపించని ఆయన పొలంలో సతీమణితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ తోటి రైతులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఫోటోలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ఇటీవలే ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ అభిమానులను ఫిదా చేసిన మాజీమంత్రి రఘువీరారెడ్డి తాజాగా మరోసారి ఆకట్టుకున్నారు. తన మనవరాలు సమైరాతో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘నన్ను నా మనవరాలు స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేస్తోంది అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మనవరాలు సమైరా స్తంభానికి కట్టేసిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మనవరాలు సమైరాకు కాస్త సమయం కేటాయించండి అంటూ సూచిస్తున్నారు. మరికొందరైతే తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్‌ చేయడం కొత్తగా ఉందని అంటున్నారు. మెుత్తానికి రఘువీరారెడ్డి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో రఘువీరారెడ్డి మంత్రిగా పనిచేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా వెలుగొందారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తొలి పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed