Jupally Krishna Rao : కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.. ఆహ్వానించిన ఖర్గే

by GSrikanth |   ( Updated:2023-08-03 04:33:13.0  )
Jupally Krishna Rao : కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.. ఆహ్వానించిన ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు, ఆయన అనుచరులతో ఖర్గే నివాసంలో గురువారం ఆయన హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి మాణిక్ ఠాక్రే, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్ రావు, మల్లు రవిలు పాల్గొన్నారు. జూపల్లితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మెఘారెడ్డి, కిచ్చారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్వర్ రెడ్డిలు కాంగ్రెస్‌లో చేశారు. అయితే, బుధవారమే వీరంతా కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే షెడ్యూల్ బిజీగా ఉండటంతో కుదరలేదు. దీంతో ఇవాళ చేరారు.

Next Story

Most Viewed