‘ఈటలది నాటకమే.. మమతా బెనర్జీలాగా చేయాలనుకుంటున్నాడు’

by Sridhar Babu |   ( Updated:2021-08-03 22:01:09.0  )
etela 1
X

దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కొత్త నాటకానికి తెరలేపారని ఈటల బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ విమర్శించారు. మంగళవారం పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ మూడు నెలల పాటు 3,500 కిలోమీటర్లు, విశారదన్ ఆరు నెలలు ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదన్నారు. నియోజకవర్గంలో 12 రోజులు 222 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మాజీ మంత్రి ఈటల ఎలా అస్వస్థతకు గురయ్యాడని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాటకాన్ని తలపిస్తున్నదన్నారు. కేవలం ఓటమి భయంతోనే మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకొని వీల్‌చైర్ పై ప్రచారానికి తెరలేపి సానుభూతితో ఎన్నికల్లో గెలుపొందాలని ఈటల చూస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు రాజేశ్వర్, ప్రవీణ్, రాహుల్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story