బీజేపీలోకి మాజీ మేయర్ తీగల ?

by Anukaran |   ( Updated:2020-11-05 04:24:42.0  )
బీజేపీలోకి మాజీ మేయర్ తీగల ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నారా ! కారు దిగి కమలం పువ్వు పట్టుకునేందుకే ఇంట్రెస్ట్‌ చూపుతున్నారా ! రెండేళ్లుగా ఏపదవీ లేకపోవడంతో వెలితిగా ఫీలై కాషాయ కండువా కప్పుకునేందుకే ఫిక్స్ అయ్యారా అంటే.. అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. గతంలో జీహెచ్ఎంసీ మేయర్‌తో పాటు 2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి మూడు నెలలకే టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మహేశ్వరం నుంచే టీఆర్ఎస్ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో సబితా ఇంద్రారెడ్డి సైతం గులాబీ కండువా కప్పుకోవడంతో తీగలకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

ఇదే క్రమంలో తీగలను బుజ్జగించిన కేసీఆర్, కేటీఆర్ శాసనమండలికి పంపుతామని హామీ ఇవ్వడంతో సైలెంట్‌గా తన పని తాను చూసుకున్నాడు. అప్పటి నుంచి ఎమ్మెల్సీ పదవి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ.. లిస్ట్ట్ లో తన పేరు లేదని కన్ఫామ్ చేసుకోవడంతో ఇక తన దారి తాను చూసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన అనుచరులు, కార్యకర్తలతో బీజేపీలో జాయిన్ అయ్యి.. చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే తన కుటుంబంలోనే మరొకరికి పదవి ఉండటంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న కోణంలో సైతం మథన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దుబ్బాకలో బీజేపీ గెలిస్తే మాత్రం వెంటనే కారు దిగి కాషాయ కండువా కప్పుకునేందుకు మెంటల్‌గా మైండ్ ప్రిపేర్‌ చేసుకున్నట్లు కార్యకర్తల ద్వారా వినపడుతోంది.

Advertisement

Next Story