- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు బుద్ది చెప్పాలి: కార్తీకరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కేసిఆర్ పార్టీకి బుద్దిచెప్పాల్సిన అవసరముందని, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బండ కార్తీకరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షలో బుధవారం ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను భాగ్యనగరం పేరుతో పిలవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీజేపీలో తనకు అన్యాయం జరగదని, సిద్దాంతాలున్న పార్టీగా నేను నమ్ముతున్నానని అందుకే 30ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రక్కన పెట్టి పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. అటు.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవి యాదవ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ… అధికార పార్టీని ప్రశ్నించే గొంతుక బీజేపీయేనని స్పష్టం చేశారు.