- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమాలతో వైసీపీ గెలుపు..అదీ ఓ గెలుపేనా: టీడీపీ నేత..
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ అబ్ధుల్ అజీజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దౌర్జన్యాలు, అక్రమాలతో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారని విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎన్నో దారుణాలకు ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లతో గెలిచిందని, చివరకు బ్యాలెట్ బాక్స్‌లకు సీళ్లను కూడా మార్చి వేశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
వైసీపీ గెలుపు కూడా ఒక గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరించారని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆయన అన్నారు. ఒకే డోరు నంబర్‌పై వెయ్యికి పైగా దొంగ ఓట్లు ఉన్నాయని వీటిని అరికట్టాలని తాము కోర్టుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. కలెక్టర్ ఈ ఆరోపణలపై స్పందించి సరిచేయాలని కమిషనర్‌ను ఆదేశిస్తే ఒక్కసారి కూడా సవరణలు జరగలేదన్నారు. భర్త ఓటు ఒకచోట.. భార్య ఓటు మరోచోట.. పిల్లల ఓటు ఇంకోచోట ఇదెక్కడి అన్యాయమని అబ్ధుల్ అజీజ్ ప్రశ్నించారు.