- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏలియన్స్ ఉన్నట్లు ట్రంప్‌కు తెలుసు!
దిశ, వెబ్‌డెస్క్: మానవులకు అంతుచిక్కని ప్రతీ విషయం అతీంద్రియ శక్తులు లేదా ఏలియన్స్ సృష్టేనని పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఈ వాదనకు బలం చేకూర్చే శాస్త్రీయ ఆధారాలేవీ ఇప్పటి వరకు కనబడలేదు. వాయువేగంతో పరిగెడుతూ రోజురోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్న ఈ e-వరల్డ్ (డిజిటల్ యుగం)లో ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉంటే ఎలా ఉంటారు? ఎక్కడుంటారు? ఏం చేస్తారు? వారిని కనుక్కోవడం సాధ్యమేనా? కాదా ? అనేది ఎడతెరిపి లేని చర్చనే. ఈ సబ్జెక్ట్‌పై రీసెర్చ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటీవల రోమేనియా, ఉటా ఎడారి ప్రాంతాల్లో మోనోలిత్(లోహపు స్తంభం)లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా యూఎస్‌లోని టెక్సాస్ సిటీ అపార్ట్‌మెంట్ కారు పార్కింగ్ ప్లేస్‌లోనూ ఓ మోనోలిత్ ప్రత్యక్షమయింది. ఇవి ఆయా ప్రదేశాలకు ఎలా వచ్చాయి? అనే విషయమై ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ లోపల కొందరు అది ఏలియన్స్ (గ్రహాంతర వాసుల)చేసిన పని అని వాదిస్తున్నారు. గ్రహాంతరవాసులు బరువైన ఈ లోహపు దిమ్మెలను ఆయా ప్లేసెస్‌లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యేలా ఎలా పెట్టి ఉంటారు? ఇవన్నీ నమ్మశక్యమేనా? అనే విషయాలు తేలాల్సి ఉంది. ఈ ఏలియన్స్ చర్చ ప్రస్తుతం అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ వరకు చేరింది. ఇజ్రాయిల్ స్పేస్ సెక్యూరిటీ ప్రోగ్రాం మాజీ చీఫ్ ప్రొఫెసర్ హైమ్ ఎషెడ్.. ఏలియన్స్ ఉన్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ కూడా తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏలియన్స్ ఉన్నాయని, వాటితో ఇజ్రాయిల్, యూఎస్ రెండు దేశాలు టచ్‌లో ఉన్నాయని ఇటీవల ప్రొఫెసర్ ఎషెడ్ ఓ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయం తనకు ఎప్పుడో తెలుసని, కానీ, రహస్యంగానే ఉంచానన్నాడు. ఎందుకంటే మానవులు గ్రహాంతరవాసులు ఉనికిని అర్థం చేసుకునే పరిస్థితి లేదని తెలిపాడు. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌నకు కూడా ఈ సంగతి తెలుసన్నాడు. ఈ గ్రహాంతర వాసుల విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నాడని, కానీ, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆపిందని చెప్పాడు. ఈ విషయం తాను ఐదేళ్ల కిందట చెబితే ఇప్పుడు ఆస్పత్రిలో ఉండేవాడినని ఎషెడ్ తెలిపాడు. ఏలియన్స్ ఉనికికి సంబంధించిన పూర్తి వివరాలతో తాను ‘ద యూనివర్స్ బియాంగ్ ద హారిజన్’ అనే బుక్ రాశానని వివరించాడు.