ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్ తొలి ఛైర్‌పర్సన్‌గా క్రిష్ గోపాలకృష్ణన్!

by Anukaran |   ( Updated:2020-11-17 11:06:57.0  )
ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్ తొలి ఛైర్‌పర్సన్‌గా క్రిష్ గోపాలకృష్ణన్!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తన ఇన్నోవేషన్ హబ్‌ను మంగళవారం ప్రారంభించినట్టు ప్రకటించింది. సమర్థవంతమైన బ్యాంకింగ్ సేవలకు ఉపయోగపడే కొత్త ఆలోచనలతో వచ్చే సంస్థలను ప్రోత్సహించేందుకు, ఆర్థిక సేవలు, అత్యవసర సమయాల్లో వ్యాపారాలను కొనసాగించేందుకు, వినియోగదారుల రక్షణను పటిష్టం చేసేందుకు ఈ హబ్ ఎంతో ఉపయోగపడనుంది. వీటికోసం సృజనాత్మక, సమర్థవంతమైన ఆర్థిక ఉత్పత్తులు, సేవలను సృష్టించడంలో, కొత్త సామర్థ్యాలను పెంపోందించడంలో ఈ ఇన్నోవేషన్ హబ్ కీలక పాత్ర పోషించనుంది.

బాధ్యతాయుతమైన ఆలోచనలను ఆర్‌బీఐ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్(ఆర్‌బీఐహెచ్) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఆర్థిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అలాంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐహెచ్‌ను ఛైర్‌పరన్ నేతృత్వంలోని గవర్నింగ్ కౌన్సిల్(జీవీ) మార్గనిర్దేసం చేస్తుంది. అలాగే, ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ సేనాపతి ‘క్రిస్’ గోపాలకృష్ణన్‌ను ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్ తొలి ఛైర్‌పర్సన్‌గా నియమించింది.

Advertisement

Next Story

Most Viewed