స్టీవ్ స్మిత్‌పై సెహ్వాగ్ ఫైర్

by Shyam |
స్టీవ్ స్మిత్‌పై సెహ్వాగ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సిడ్ని వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు డ్రా గా ముగిసింది. కీలక సమరంలో విరోచిత పోరాటం చేసిన టీమిండియా ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో సిరీస్‌లో 1–1తోనే సమాన స్థితిలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ 118 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. అయితే రిషభ్ క్రీజులో ఉన్న సమయంలో డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఆటగాళ్లందరూ బ్రేక్‌కు వెళ్లినప్పుడు మైదానంలోనే ఆగిపోయిన ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. బ్యాటింగ్ సమయంలో వికెట్ల వద్ద పంత్ చేసుకున్న గార్డ్ మార్కును చెరిపేశాడు. ఈ ఉదంతం మొత్తం మెయిల్స్ కెమెరాకు చిక్కింది. దీంతో స్మిత్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. దీన్ని షేర్ చేసిన సెహ్వాగ్.. స్మిత్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని ఎద్దేశా చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజాయితీగా ఆడకుండా, ఇలా అడ్డదార్లు తొక్కడమేంటని? స్మిత్‌ను ప్రశ్నిస్తున్నారు. భారత కెప్టెన్ రహానే కూడా మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో దీని గురించి ప్రశ్నించాడు. గతంలో కూడా స్మిత్ ఇలానే బాల్‌ట్యాంపరింగ్ చేస్తూ దొరికిపోయి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed