గుజరాత్ మాజీ సీఎం ఇకలేరు 

by Sumithra |
గుజరాత్ మాజీ సీఎం ఇకలేరు 
X

అహ్మదాబాద్ : గుజరాత్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్ సిన్హా సోలంకి(93) శనివారం ఉదయం గాంధీనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. మోడీ తర్వాత దీర్ఘకాలం రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన సోలంకి నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. సోలంకి మరణం కలచి వేసిందని కాంగ్రెస్ గుజరాత్ ప్రెసిడెంట్, సోలంకి బంధువు అమిత్ చావడా పేర్కొన్నారు. మాధవ్ సిన్హా కుటుంబానికి సీఎం విజయ్ రూపానీ సానుభూతి తెలిపడమే కాకుండా, శనివారం రాష్ట్ర వ్యాప్త సంతాప దినంగా ప్రకటించారు. అధికారిక లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహిస్తామని వివరించారు.

గుజరాత్ రాజకీయాల్లో సోలంకి క్రియాశీలక పాత్ర పోషించారని, ఆయన చేసిన సామాజిక సేవను మరిచిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మాధవ్ సిన్హా సోలంకి కుమారుడు భారత్ సోలంకితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. సిన్హా మరణం బాధాకరమని, కాంగ్రెస్ భావజాలాన్ని సుస్థిరం చేయడం, సామాజిక న్యాయాన్ని పటిష్టం చేయడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్‌కు నాలుగు సార్లు సీఎంగా సేవలందించిన సోలంకి కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed