గుజరాత్ మాజీ సీఎం మాధవ్‌సింగ్ సోలంకి కన్నుమూత

by Shamantha N |
గుజరాత్ మాజీ సీఎం మాధవ్‌సింగ్ సోలంకి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్‌సింగ్ సోలంకి కన్నుమూశారు. 94 ఏళ్ల మాధవ్ సింగ్ గాంధీనగర్‌లోని తన నివాసంలో శనివారం తుది శ్వాస విడిచారు. మాధవ్ సింగ్ సోలంకి కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 1980ల్లో గుజరాత్‌లో కేహెచ్‌ఏఎం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) సూత్రంపై అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికలకు ముందు కేహెచ్‌ఏఎం కూటమిని ఏర్పాటు చేశారు. సోలంకి వృత్తిరీత్యా న్యాయవాది. 1976లో కొంతకాలం ముఖ్యమంత్రి పని చేశారు. మళ్లీ 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు.

మాధవ్ సింగ్ సోలంకి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు గుజరాత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సోలంకి బలీయమైన నాయకుడని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Advertisement

Next Story