- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తనకో ‘సొంత’ అడవి ఉంది!
దిశ, వెబ్‌డెస్క్ :ప్రకృతి సౌందర్యాలను ప్రేమించనిదెవ్వరు? పచ్చనిచెట్ల మీద రంగు, రంగుల పిట్టలు, పొదల మాటున తళతళలాడే నెమళ్లు, కుందేళ్లు, జింకల పరుగులు, పులి గాండ్రింపులు ఒక్కసారి దృష్టికి వచ్చినా, చిక్కినా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీటన్నింటికి సొంతిళ్లులాంటిదే అడవి. ఆ అడవిపై అమిత ప్రేమ ఉన్న మాజీ సివిల్ సర్వెంట్ ఆదిత్యాసింగ్ ఏకంగా 35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి చెట్లు, పొదలు పెరిగేందుకే ఖాళీగా వదిలిపెట్టాడు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు తన కల సాకారమైందని ఆనందపడుతున్నాడు.
అడవి, వన్యప్రాణులంటే ఆదిత్యా సింగ్, పూనమ్ సింగ్ దంపతులకు వల్లమానిన అభిమానం. వనం అంటే ప్రాణమిచ్చే ఆదిత్యాసింగ్ ఢిల్లీలో సౌకర్యవంతమైన ఇల్లు వదిలి, సివిల్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లాడు. రణథంబోర్ టైగర్ రిజర్వ్(ఆర్‌టీఆర్)కు సమీపంలోని సవాయి మాధోపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. అనంతరం టైగర్ రిజర్వ్‌తో సరిహద్దు పంచుకుంటున్న భద్లావ్ అనే ప్రాంతానికి నివాసాన్ని మార్చుకున్నారు. ఆ అటవీ ప్రాంతాన్ని, వన్యప్రాణులను చూస్తూ ఇరువురు వాటిపై ప్రేమను రెట్టింపు చేసుకున్నారు.
ఆర్‌టీఆర్‌కు సమీపంలోని భూమిలో సాగుచేసుకునేందుకు అక్కడి రైతులు భయపడుతుండేవారు. ఆర్‌టీఆర్‌లోని పులులు బయటికి వచ్చి ఎప్పుడు తమ పంటపొలాల్లోకి వస్తాయోనని ఆందోళనపడుతుండేవారు. అదీగాక, మారుమూల ప్రాంతం కావడంతో సరైన రవాణా మార్గాలు, విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో అక్కడ వ్యవసాయానికి రైతులు పెద్దగా ఆసక్తి చూపించకపోయేవారు. ఆర్‌టీఆర్‌కు ఆనుకునే ఉన్న ఆ భూములను కొనుగోలు చేసి అందులోనూ అడవిని పెంచాలని ఆదిత్యాసింగ్, పూనమ్ సింగ్ దంపతులు భావించారు. 1998 నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి చెట్లు, పొదలు పెరిగేందుకే వదిలిపెట్టారు. ఇప్పుడు ఆర్‌టీఆర్ సరిహద్దులోని ఈ భూమిలో పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. ఆర్‌టీఆర్ నుంచి జంతువులూ ఈ అడవిలోకి వస్తుంటాయి. సహజంగా ఏర్పడిన రెండు నీటి కొలనుల్లో నీరు తాగి సేదతీరుతుంటాయి. వాటితోపాటు ఆదిత్యా సింగ్ కూడా మరిన్ని నీటి తటాకాలను ఏర్పాటు చేశాడు. కొనుగోలు చేసిన భూమిలోనూ అన్ని చోట్లకు ఆదిత్యా సింగ్ వెళ్లడు. అలా వెళితే జంతువులు వాటి సంచారాన్ని తగ్గించుకోవచ్చని చెబుతాడు. ఆర్‌టీఆర్ పరిసరాలను ఏరియల్ వ్యూలో చూపిస్తూ.. తాను కొనుగోలు చేసిన భూమిలో అడవిని చూసి సంబురపడిపోతుంటాడు ఆదిత్యా సింగ్. నాకంటు ఒక అడవి ఉన్నదని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటూ పొంగిపోతున్నాడు.
ఆర్‌టీఆర్‌కు తాను కొనుగోలు చేసిన భూమికి మధ్యలో ఒక గోడ ఉంది. రెండు కొండలను కలుపుతూ ఉండే ఈ గోడకు ఇటువైపున తను పెంచిన అడవిలో వన్యప్రాణుల రాకతోపాటు అక్కడ నివాసముండే కొన్ని కుటుంబాలవారు మేకలు, గొర్రెలు, ఇతర పశువులను మేపుతుంటారు. ఈ అడవి వారికీ వనరేనని ఆదిత్యా సింగ్ అంటూ వారి వరకైతే సరే.. బయటివారి నుంచి పశువులను తీసుకొస్తే అభ్యంతరం చెబుతానని వివరించాడు. తన భూమిలోని వన్యప్రాణులను పర్యవేక్షించేందుకు అటవీశాఖతోనూ కలిసి పనిచేస్తుంటాడు.
భారత్‌లో 50 టైగర్ రిజర్వులున్నాయి. ఇందులో రణథంబోర్ టైగర్ రిజర్వ్ దేశంలో అతిపెద్దది. ఈ రిజర్వ్‌లో సుమారు 60 పులులున్నట్టు అంచనా.