‘ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. డీఎస్పీ దగ్గరుండి చేయించారు’

by Anukaran |   ( Updated:2020-07-18 04:53:35.0  )
‘ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. డీఎస్పీ దగ్గరుండి చేయించారు’
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానాయకుడు, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని నెల్లూరు జిల్లా కావలిలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మేయర్ అజీజ్ శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం వైసీపీ దౌర్జన్యానికి నిదర్శనం అని విమర్శించారు. కావలి డీఎస్పీ ప్రసాదరావు వైసీపీ నేత అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. డీఎస్పీ దగ్గరుండి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని బీద రవిచంద్ర ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed