బిగ్ బ్రేకింగ్: మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

by Anukaran |   ( Updated:2021-12-04 00:34:47.0  )
బిగ్ బ్రేకింగ్: మాజీ సీఎం రోశయ్య కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్య‌మంత్రి రోశయ్య కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను శనివారం ఉదయం హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య ఏడాది కాలం పని చేసిన విషయం తెలిసిందే. రోశయ్య మృతి చెందడంతో రాజకీయ ప్రముఖులు, పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేసారు.

‘మహానేత’ కొణిజేటి ‘రోశయ్య’ రాజకీయ ప్రస్థానం ఇదే..

ఆదివారం మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

Advertisement

Next Story