- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కరోనాతో కాంగ్రెస్ కీలక నేత మృతి
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో పాటు, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనాకు బలి అయ్యారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి చనేష్ రామ్ రతియా(78) కరోనా వైరస్ బారిన పడి మృతిచెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన రాయ్‌గర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాగా సోమవారం పరిస్థితి విషమించి మరణించారని వైద్యాధికారులు తెలిపారు.
రతియాకు భార్య, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు లాల్‌జిత్ సింగ్ రతియా ధరంజైగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రముఖ గిరిజన నాయకుడు చనేష్ రామ్ రతియా 1977లో అప్పటి అవిభక్త మధ్యప్రదేశ్‌లోని ధరంజైగర్ స్థానం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదనంతరం ఇదే స్థానం నుంచి ఆయన వరుసగా మరో ఐదుసార్లు గెలుపొందారు.