- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నర్సరీలో మొక్కల్లా.. పెరుగుతున్న కరోనా’
దిశ, మెదక్: రాష్ట్రంలో కరోనా నర్సరీలో మొక్కల మాదిరి పెరుగుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో యెండల మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కాలంలో కఠినంగా ప్రవర్తించి, రోడ్డుమీద కనిపిస్తే కాల్చివేత అన్న సీఎం కేసీఆర్ నేడు నిబంధనలు తుంగలో తొక్కారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌వి మాటలు మాత్రమే కఠినం.. చేతలు మాత్రం శూన్యమన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉన్న కరోనా అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉద్దేశ పూర్వకంగా కరోనా పరీక్షలు చేయకపోవడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. కరోనా విస్తరిస్తున్న అరికట్టే స్థితిలో ప్రభుత్వం లేదని, అత్మనిర్బర్ భారత్ కింద కేంద్రం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ఇచ్చిందన్నారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాల్లో చేస్తున్న టెస్టుల కంటే మన దగ్గర తక్కువగా చేస్తున్నారని విమర్శించారు. ఆయనతో పాటు మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.