- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌పై విమర్శలు చేస్తుంటే రక్తం మరిగిపోతోంది.. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం భారత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా.. అక్కడక్కడా లాక్‌డౌన్ విధించినా ఫలితం లేకుండా పోతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల పెరుగుదలతో పాటు మరణాలు కూడా భయంకరంగా సంభవిస్తున్నాయి. దీంతో ప్రపంచ మీడియా భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ మద్దతు తెలిపిన ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ క్రికెటర్ మాథ్యు హెడెన్ ప్రపంచ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి సంక్షోభంలో ఇండియాకు ప్రపంచ దేశాలు మద్దతు పలకడం గర్వించదగ్గ విషయమన్నాడు.
భారతదేశానికి సహాయపడేందుకు తాను ఎప్పుడు సిద్ధం అని మద్దతును ప్రకటించాడు. దాదాపు దశాబ్ద కాలంగా తాను భారత్‌తో సంబంధాలు కలిగి ఉన్నానని, మరీ ముఖ్యంగా తమిళనాడుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాడు. భారత ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. విపత్కర పరిస్థితులను ఆసరాగా చేసుకొని, భారత్‌పై ప్రపంచ మీడియా అక్కసు వెల్లగక్కుతోందని, మీడియా చేస్తున్న ఆరోపణలకు తన రక్తం మరిగిపోతుందని మండిపడ్డాడు. ఇలాంటి విమర్శలకు భారత్ ఎప్పుడూ కుంగిపోదు అని అభిప్రాయపడ్డాడు.