- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా రైతు పై ఫారెస్ట్ అధికారి దాడి
దిశ,కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా, సుజాతనగర్ మండలం గరిపేట పరిధిలోని సర్వే నంబర్.20 పోడు భూమి విషయంలో గురువారం ఫారెస్ట్ అధికారులు మహిళలపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం మండలం రామవరం ఏజెన్సీ ప్రాంత పరిధిలోని చిట్టిరామవరం తండాకు చెందిన పోడు రైతులు గత నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పట్టాలు ఇప్పించాలని కలెక్టర్, డిఎఫ్ఓ, ఐటీడీఏ పీవో తదితర అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తే వారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
గురువారం రైతులు దుక్కి దున్నే సమయంలో రామవరం అటవీ రేంజ్ అధికారులు జీపు మీద వచ్చి మహిళలని కూడా చూడకుండా దాడులు చేశారు. ఈ దాడిలో లక్ష్మి, కమిలి, సోటిలపై గొడ్డలి కామతో దాడి చేయగా వారు గాయపడ్డారు. వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 108 వాహనం ద్వారా తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా ఈ క్రింది స్థాయి అధికారులు తమపై దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే వారిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- forest officer