- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిరికి వాళ్లు ఆత్మహత్య చేసుకోరు : నారాయణరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రూ.కోటి 10 లక్షల లంచం తీసుకుని సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ నాగరాజు చర్లపల్లి జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు మృతికి పోలీసులే కారణమని, దీనిపై విచారణ జరిపించాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు. అయితే, కీసర తహసీల్దార్ మృతిపై ఫోరెన్సిక్ నిపుణులు నారాయణరెడ్డి మంగళవారం పలు కీలక విషయాలు వెల్లడించారు.
పిరికివాళ్లు ఎన్నడూ ఆత్మహత్య చేసుకోరని.. ధైర్యవంతులే చేసుకుంటారని స్పష్టంచేశారు. జైల్లో పోలీసులు విచారణ జరపరు.. కావున మానసిక ఒత్తిడి వల్లే అతను సూసైడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. సాధారణంగా జైల్లో కానీ, బయట గానీ ఉదయం 3-4గంటల మధ్యే సూసైడ్ చేసుకుంటారని చెప్పారు. నాగరాజుది పార్షల్ హ్యాంగింగ్ గానే అనిపిస్తోందని, సింథటిక్ కాటన్ బట్టతో ఉరేసుకుంటే ఎలాంటి మరకలు కన్పించవన్నారు. తాడుతో వేసుకుంటేనే మరకలు కన్పిస్తాయన్నారు. ఏడు ఫీట్లున్న కిటికీ గ్రిల్ కు టవల్‌తో ఉరేసుకుంటే ఎలాంటి శబ్దం రాదని, ఆ సమయంలో నాగరాజు కాళ్లు నేలకు అనుకుని ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదన్నారు. దీంతో 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయి ఉంటాడని నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.