హైదరాబాద్‌లో విదేశీయురాలు దారుణ హత్య.. ఆ విషయంలో గొడవ జరిగే..

by Sumithra |   ( Updated:2021-09-11 07:18:10.0  )
Foreign woman murder
X

దిశ, వెబ్‌డెస్క్ : అనాథ అని దత్తత తీసుకున్నందుకు ఆమె ప్రాణాలే పోయాయి. నవ మాసాలు మోసి జన్మను ఇవ్వకపోయినా.. అంతకన్న ఎక్కువ ప్రేమను పంచింది. అయినా పాముకు పాలు పోసి పెంచినట్లు పెరిగి పెద్దకాగానే దత్తత తల్లినే కాటేసింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజేంద్రనగర్‌లో ఫ్రాన్స్ దేశానికి చెందిన మెరిక నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నా.. రుమా అనే అమ్మాయిని దత్తత తీసుకోని పెంచుకుంటుంది. మెరిక స్థానికంగా ఉన్న మారిక స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పని చేస్తోంది. అయితే ఆమె దత్తత కూతురు రుమా ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మెరిక ఒప్పుకోకపోవడంతో తల్లీకూతురు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.అయితే శుక్రవారం రాత్రి రుమా ప్రియుడితో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. స్థానికులనూ విచారించారు. అయితే దత్తత కూతురు రుమానే తల్లిని చంపి ఉంటుందని, వారిద్దని మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రుమా, ఆమె ప్రియుడి వ్యవహార శైలి సైతం పోలీసులకు అనుమానం కలిగించడంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించారు. దీంతో అదృశ్యం కేసు కాస్తా హత్యగా మారింది. తల్లిని కూతురే హత్యచేసి ప్రియుడితో కలిసి హిమాయత్ సాగర్ ప్రాంతంలో పడేశారు. వారి సమాచారం ప్రకారం మెరిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోర్ట్ మార్టానికి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్తి కోసమే కూతురు దత్తత తల్లిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Next Story